AP Pensioners Names Removed 2025: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం AP పింఛను దారులకు షాకింగ్ విషయాన్ని తెలిపింది. పింఛన్లు పొందే చాల మంది పేర్లను జాబితాల్లోనుండి తొలగించడం జరిగింది. ఈ నెల పింఛన్లు జూన్ 1 వ తేదీ న కాకుండా మే 31 వ తేదీ న ఇవ్వడం జరిగింది. తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 3,38,846 మంది పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఇది పెన్షన్ పొందుతున్న వారిలో ఓ భారీ కోతగా చెప్పవచ్చు.

తొలగింపుకి గల కారణాలు
అర్హుల లిస్టు లో నుండి పేర్లు తొలగించడానికి గల కారణాలు ఏంటంటే, పించను పొందే చాల మంది వ్యక్తులు ఇప్పటికే మృతి చెందడం వలన మరియు కొంతమంది అందుబాటులో లేకపోవడం వలన మరియు కొంతమంది అనర్హులు అవ్వడం కారణం వలన తొలగించినట్లు తెలుపుతున్నారు.
గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి
గణాంకాల ప్రకారం, మే నుంచి జూన్ వరకు మొత్తం 89,666 మంది పేర్లు పింఛన్ లిస్టు నుండి తొలగించబడగా, కొత్తగా 71,380 మందిని చేర్చారు. దీంతో నెట్ తేడా -18,286గా ఉంది. ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో మొత్తం 3,38,846 మంది పేర్లు తొలగించబడ్డాయి. ఈ వివరాలను చూస్తే, గత వైసీపీ పాలనలో అనర్హులకి పెద్ద సంఖ్యలో పింఛన్లు మంజూరయ్యాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
కొత్త పెన్షన్ల వలన ప్రభుత్వంపై భారం పడనుందా?
కొత్త పెన్షన్ల భారం ప్రభుత్వంపై పడుతుందా? అన్న ప్రశ్నపై ప్రభుత్వం వర్గాలు రూ.35 కోట్లు అదనపు భారం అవుతుందని చెబుతున్నా, వాస్తవాన్ని పరిశీలిస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే, తొలగించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండగా, కొత్తగా చేర్చినవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే, ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరగడం కాకుండా తగ్గే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది.
కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ
ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త పెన్షన్ దరఖాస్తులను స్వీకరించలేదు. అయితే జూలై నెల నుండి కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే, జూన్‌లోనే దరఖాస్తులను స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, అది ఎప్పుడైనా రావచ్చు. అందుకే ఆసక్తి ఉన్న వారు తాజా సమాచారం కోసం తమ గ్రామ లేదా వార్డు సచివాలయాలను సంప్రదించడం ఉత్తమంగా పేర్కోవడం జరుగుతుంది.
| Official Website Link | sspensions.ap.gov.in |
AP Pensioners Names Removed 2025 – FAQs
Many names were removed due to beneficiaries being deceased, unavailable, or found ineligible.
As per official data, 3,38,846 names have been removed so far this year.
The government hasn’t officially started new applications yet, but they may begin in June to issue pensions from July.
