PM SVANidhi Yojana: కరోనా సమయంలో స్ట్రీట్ వెండర్స్‌కు ఆర్థిక ఆసరాగా కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఫలాలు, కూరగాయలు, పాన్ షాప్, సలూన్, లాండ్రీ వంటి చిన్న వ్యాపారాలు చేసే 68 లక్షల మందికి పైగా వ్యక్తులు రుణం పొందారు. ఇప్పటి వరకు రూ. 13,790 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేయబడ్డాయి, ఇది చిన్న వ్యాపారుల జీవనంలో స్థిరత్వం తెస్తోంది.

ఈ యోజన ద్వారా స్టీట్ వెండర్స్ ఎటువంటి హామీ లేకుండా తొలుత రూ. 10,000 రుణం పొందవచ్చు. సకాలంలో చెల్లింపులు చేస్తే, రుణం రూ. 20,000, ఆ తర్వాత రూ. 50,000 వరకు పెరుగుతుంది. ఈ రుణాలతో పాటు, 7% వార్షిక వడ్డీ సబ్సిడీ మరియు డిజిటల్ లావాదేవీలపై రూ. 1,200 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. ఈ పథకం వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించి, వారి వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు సహాయపడుతుంది.
For more updates join in our whatsapp channel
ఈ రుణం పొందేందుకు 2020 మార్చి 24కి ముందు వీధి వ్యాపారం చేస్తూ, మునిసిపల్ అధికారుల వద్ద నమోదైన వ్యక్తులు అర్హులు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటి కేవైసీ పత్రాలు తప్పనిసరి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు, మైక్రోఫైనాన్స్ సంస్థలు, కో-ఆపరేటివ్ బ్యాంకులు ఈ రుణాలను అందిస్తాయి. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
దరఖాస్తు చేయడం సులభం. www.pmsvanidhi.mohua.gov.in వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్) లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను కూడా సంప్రదించవచ్చు. ఈ యోజన వీధి వ్యాపారులకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, వారి జీవనంలో కొత్త ఆశలను నింపుతోంది.
అధికారిక వెబ్సైట్: http://www.pmsvanidhi.mohua.gov.in/
PM SVANidhi Yojana – FAQs
2020 మార్చి 24కి ముందు వీధి వ్యాపారం చేస్తూ, మునిసిపల్ అధికారుల వద్ద నమోదైన స్ట్రీట్ వెండర్స్ అర్హులు.
మూడు దశల్లో రూ. 10,000, రూ. 20,000, రూ. 50,000 వరకు రుణం లభిస్తుంది.
లేదు, ఈ యోజన కింద ఎటువంటి హామీ అవసరం లేదు.
అవును, డిజిటల్ లావాదేవీలపై రూ. 1,200 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
